News August 23, 2024
బంద్ విరమించిన వైద్యుల సంఘం
వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న బంద్‌ను విరమిస్తున్నట్లు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్(UDFA) ప్రకటించింది. ‘ఘటనపై న్యాయం చేస్తామన్న సుప్రీం కోర్టు హామీ మేరకు బంద్ విరమిస్తున్నాం. రోగులపై శ్రద్ధ తీసుకోవాలన్న నిబద్ధతతో, న్యాయవ్యవస్థఫై ఉన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వైద్యుల రక్షణ కోసం అత్యవసరంగా కేంద్ర రక్షణ చట్టాన్ని(CPA) తీసుకురావాలి’ అని పేర్కొంది.
Similar News
News September 13, 2024
సైబర్ మోసం.. రూ.45 లక్షలు పోగొట్టుకున్న నటుడు
సైబర్ నేరాల గురించి రోజూ వింటున్నా కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు బిష్ణు అధికారి రూ.45 లక్షలు పోగొట్టుకున్నారు. యూట్యూబ్‌లో ఇచ్చిన టాస్కులు పూర్తిచేస్తే డబ్బులు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఇతడిని నమ్మించారు. ఇందుకోసం తొలుత కొంత మనీ ఇవ్వాలనడంతో పలు అకౌంట్లలో జమ చేశారు. చివరికి మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను స్వీయదర్శకత్వంలో హిట్ మ్యాన్ అనే మూవీని తీశారు.
News September 13, 2024
తొలి మంకీపాక్స్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ కట్టడికి WHO తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బవేరియన్ నార్డిక్ సంస్థ తయారుచేసిన MVA-BN వ్యాక్సిన్‌ను వాడొచ్చని తెలిపింది. అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతవారం మంకీపాక్స్‌తో 107 మంది మరణించగా 3,160 కొత్త కేసులు నమోదైనట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపింది.
News September 13, 2024
ఐసెట్: తొలి విడతలో 30,300 సీట్లు భర్తీ
TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. రెండు కోర్సుల్లో 34,748 సీట్లు ఉండగా 30,300 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 17లోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు.