News February 10, 2025

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడికి బండి ఫోన్

image

TG: దుండగుల <<15408903>>దాడి ఘటనలో<<>> గాయపడిన చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్‌‌‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్‌లో పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు Xలో వెల్లడించారు.

Similar News

News April 5, 2026

నీటి సంరక్షణ.. రేపటి నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్

image

AP: నీటి సంరక్షణ-జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు 100 రోజుల(ఏప్రిల్ 6-జులై 14) కార్యాచరణను ప్రకటించారు. రేపు అనంతపురం(D) యాడికిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. నీటిని నిల్వ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని CM అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 5, 2026

థార్ ఎడారిలో రికార్డు స్థాయి క్రూడాయిల్ ఉత్పత్తి

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్ రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో క్రూడాయిల్ వెలికితీతను భారీగా పెంచింది. బాఘేవాలా ఫీల్డ్ నుంచి రోజుకు 1,202 బ్యారెళ్ల రికార్డు ఉత్పత్తిని సాధించింది. గతేడాది(రోజుకు 705 బ్యారెళ్ల)తో పోలిస్తే 70% అధికం. ఈ ముడి చమురును ట్యాంకర్ల ద్వారా గుజరాత్‌లోని రిఫైనరీలకు తరలిస్తారు. బాఘేవాలాలో 200 చ.కి.మీ విస్తీర్ణంలో చమురు నిల్వలు విస్తరించి ఉన్నాయి. FY26లో 43,773 మె.టన్నులను ఉత్పత్తి చేశారు.

News April 5, 2026

ధనుష్‌లో మా నాన్నను చూసుకున్నా: విఘ్నేశ్ శివన్

image

ధనుష్‌తో విభేదాలపై నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ విచారం వ్యక్తం చేశారు. ‘ధనుష్ పుట్టిన జులై 28నే మా నాన్న చనిపోయారు. అందుకే ఆయనలో నాన్నను చూసుకున్నా. ఆయనతో బంధాన్ని కోల్పోవడంపై సిగ్గుపడుతున్నా. నేను ఈ స్థాయిలో ఉండేందుకు కారణం ధనుష్. VIP మూవీ టైంలో రెండేళ్లు కలిసి ఉన్నా’ అని యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపారు. నయనతార డాక్యుమెంటరీ విషయంలో వీరి మధ్య <<14626837>>వివాదం<<>> తలెత్తడం తెలిసిందే.