News June 4, 2024

బండి సంజయ్ గెలుపు

image

కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ విజయం సాధించారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయగా, 2.12లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. ఇదే స్థానంలో కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్రావు, BRS నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేశారు.

Similar News

News November 8, 2024

అభిషేక్.. ఇలా అయితే కష్టమే!

image

టీమ్‌ఇండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. జింబాబ్వేపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో 0, 10, 14, 16, 15, 4, 7 (ఇవాళ సౌతాఫ్రికాపై) స్వల్ప పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచారు. రాబోయే మ్యాచుల్లో అయినా అతను రాణించాలని, లేదంటే జట్టులో చోటు కోల్పోయే ఛాన్సుందని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News November 8, 2024

46 రోజుల్లో భూమిని చుట్టేసే పక్షి!

image

ఆల్బట్రాస్ అనే పక్షి భూమిని 46 రోజుల్లోనే చుట్టి వస్తుంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పేరిట పక్షి జాతుల పరిశోధకులు 2005లో వీటిపై అధ్యయనం నిర్వహించారు. ఆ జాతికి చెందిన 22 పక్షులకు ట్రాకింగ్ పరికరాల్ని అమర్చి వాటి వలస మార్గాల్ని ట్రాక్ చేశారు. దక్షిణ అట్లాంటిక్‌లోని దక్షిణ జార్జియా నుంచి వలసకు బయలుదేరిన ఆల్బట్రాస్‌లలో కొన్ని పక్షులు 46 రోజుల్లో భూమిని చుట్టి వచ్చినట్లు ఆ అధ్యయనంలో తేలింది.

News November 8, 2024

ఆ రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ

image

AP: చిలకలూరిపేట, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి విడదల రజిని, తాడికొండకు వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు)ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.