News June 20, 2024

బంగినపల్లి మామిడికి రికార్డు ధర

image

AP: రాష్ట్రంలోనే పేరొందిన ఉలవపాడు బంగినపల్లి మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను రూ.90 వేలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో గరిష్ఠ ధర రూ.50 వేలు. ఇటు కవర్ కట్టిన కాయలైతే టన్ను రూ.లక్షపైనే పలుకుతుండగా స్టాక్ ఉండటం లేదు. కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడమే ఇందుకు కారణం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనేందుకు ఎగబడుతున్నారు.

Similar News

News September 8, 2024

రెండో రోజు వినాయకుడిని ఎలా పూజించాలంటే..?

image

వినాయక నవరాత్రుల్లో రెండో రోజు అంటే భాద్రపద శుద్ధ పంచమి నాడు గణపతిని ‘వికట వినాయకుడు’ అంటారు. ‘లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. స్వామికి ఆవాహన పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. రెండో రోజు పూజ లక్ష్యం సమాజం దుష్ట కామాన్ని వీడటం.

News September 8, 2024

ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఇలా..

image

కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
✒ శ్రీశైలం: ఇన్‌ఫ్లో 2.86లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.09లక్షలు
✒ సాగర్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.99లక్షలు
✒ పులిచింతల: ఇన్‌ఫ్లో 2.75లక్షలు, ఔట్‌ఫ్లో 2.97లక్షలు
✒ ప్రకాశం బ్యారేజ్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.88లక్షల క్యూసెక్కులు

News September 8, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.