News September 21, 2024
చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్
బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు(15,205) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. భారత్‌తో టెస్టులో రెండో ఇన్నింగ్సులో 13 పరుగులతో తమీమ్ ఇక్బాల్(15,192)ను అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో షకీబ్(14,696), మహ్మదుల్లా(10,694), లిటన్ దాస్(7,127) ఉన్నారు.
Similar News
News October 9, 2024
JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!
టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.
News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి
TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.
News October 9, 2024
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్‌లకు, ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.