News December 5, 2024
హసీనాపై ప్రసారాల్ని నిషేధించిన బంగ్లా కోర్టు
బంగ్లా మాజీ PM షేక్ హసీనా ప్రసంగాల ప్రసారాన్ని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్(ICT) కోర్టు నిషేధించింది. ఆమెపై ఉన్న హత్యారోపణలపై దర్యాప్తు జరుగుతోందని, ప్రసారాలు సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదమున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ప్రాసిక్యూటర్ హొస్సేన్ తమీమ్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ యూనస్ బంగ్లాలో హిందువులపై దాడుల్ని ఓ కుట్ర ప్రకారం అమలు చేస్తున్నారని హసీనా ఇటీవల ఆరోపించారు.
Similar News
News January 22, 2025
అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే ఫిఫ్టీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆయన అర్ధ శతకం చేశారు. ఆదిల్ రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 93/2గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి ఇంకా 40 పరుగులు కావాల్సి ఉంది.
News January 22, 2025
మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్‌ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.
News January 22, 2025
భారత్ పిచ్‌పై తేలిపోయిన RCB బ్యాటర్లు!
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.