News August 5, 2024
బంగ్లా: హిందూ ఆలయాలు, ఇందిరా కేంద్రానికి మంటలు

బంగ్లాలో అల్లరి మూకలు చెలరేగుతున్నాయి. హిందూ ఆలయాలు, స్మృతి కేంద్రాలను తగలబెడుతున్నాయి. రంగాపుర్ సిటీలో హిందూ కౌన్సిలర్ హర్షవర్ధన్‌ను కాల్చిచంపిన దుండగులు ఇస్కాన్ సహా కాళీ ఆలయాలే లక్షంగా నిప్పంటించారు. ఇక ఢాకాలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్, బంగబంధు మెమోరియల్ మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. కొంత భాగాన్ని తగలబెట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కీలక కూడళ్లలో మౌలిక సదుపాయాల్నీ నాశనం చేస్తున్నారు.
Similar News
News April 9, 2026
10-15 నిమిషాల్లో తినేస్తున్నారా?

సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం. దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట.
Share It
News April 9, 2026
ఇది విన్నారా.. పాక్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలట!

పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అక్కడి మీడియా డిమాండ్ చేస్తోంది. ‘అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపడంలో పాక్ కీలక పాత్ర పోషించింది. చర్చలకు అవసరమైన పరిస్థితులను సృష్టించింది. ఇరుపక్షాలకు నమ్మకమైన సమాచార దూతగా వ్యవహరించింది’ అని ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతా బానే ఉంది కానీ.. ఈ శాంతి బహుమతి కోసం విశ్రాంతి లేకుండా ప్రయత్నించిన ట్రంప్ ఊరుకుంటారా?
News April 9, 2026
వరి కొనుగోళ్లు ప్రారంభం.. 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు!

TG: రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్ వరి కొనుగోలు ప్రారంభమైంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా 8,251 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొనుగోలు చేసిన 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది. అలాగే నాణ్యమైన ధాన్యానికి క్వింటాల్‌పై రూ.500 కూడా వెంటనే అందించనుంది. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


