News August 8, 2024
హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు?
TG: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశీయులు హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని బాలాపూర్, కాటేదాన్, పహాడీషరీఫ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా గత రెండేళ్లలో వెయ్యి మందికిపైగా బంగ్లా నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News September 14, 2024
నైపుణ్యం ఉన్నవారికి గంభీర్ మద్దతు ఉంటుంది: పీయూష్
టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రశంసలు కురిపించారు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు ఆయన మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ‘ఆయన ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతారు. స్వేచ్ఛగా ఆడమని చెబుతారు. మీలో టాలెంట్ ఉందని అనిపిస్తే మీరు ప్రదర్శన చేయకపోయినా అండగా నిలిచి అవకాశాలిస్తారు. ఏ ఆటగాడికైనా అదే కావాలి. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే గౌతీ వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు’ అని వెల్లడించారు.
News September 14, 2024
ఆధార్ FREE అప్డేట్ తేదీ పొడిగింపు
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే గడువును డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు UIDAI కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. పదేళ్లకు పైగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వారు, తమ డేటా వివరాల కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు సంబంధిత ఆధారాలను సమర్పించాలి. అడ్రస్, చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటివి సులభంగా మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేసేందుకు ఇక్కడ <
News September 14, 2024
సూర్యా.. భారత్‌కు మరెన్నో విజయాలు అందించు: జై షా
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఆయనకు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత టీ20ఐ కెప్టెన్, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్‌కు హ్యాపీ బర్త్ డే. పొట్టి ఫార్మాట్‌లో మన జట్టుకు మీరు మరెన్నో విజయాలకు సాధించిపెట్టాలి. బెస్ట్ విషెస్ ఫర్ ది ఇయర్ ఎహెడ్’ అని ట్వీట్ చేశారు. ఈరోజు సూర్య తన 34వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు.