News August 5, 2024
బంగ్లా అల్లర్లు: పార్లమెంటులో మోదీ వద్దకు జైశంకర్

ప్రధాని నరేంద్ర మోదీని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పార్లమెంటులో అత్యవసరంగా కలిశారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు, షేక్ హసీనా రాజీనామా, సైనిక ప్రభుత్వ ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించారని తెలిసింది. సరిహద్దుల్లో రెట్టింపు భద్రత, బలగాల మోహరింపు గురించీ మాట్లాడినట్టు సమాచారం. కేంద్రం రెండ్రోజుల కిందటే BSF చీఫ్‌ను మార్చిన సంగతి తెలిసిందే. రాహుల్ సైతం బంగ్లా వ్యవహారాలపై జైశంకర్‌తో మాట్లాడారని తెలిసింది.
Similar News
News November 6, 2025
ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.
News November 6, 2025
‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News November 6, 2025
TG SETకు దరఖాస్తు చేశారా?

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించే <


