News August 6, 2024
బంగ్లా మరో పాకిస్థాన్ అవుతుంది: హసీనా కుమారుడు
బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజిద్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి తన తల్లి ఎంత కృషి చేసినా ఇప్పుడు బంగ్లా పాకిస్థాన్‌లా మారుతోందన్నారు. అంతర్జాతీయ సమాజం తన తల్లిని విమర్శించడంలో బిజీగా ఉందని తప్పుబట్టారు. గత 15 ఏళ్లలో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా బంగ్లా స్థిరత్వాన్ని చవిచూసిందని వివరించారు.
Similar News
News September 15, 2024
773 చోట్ల గండ్లు.. 2 పంప్‌హౌస్‌ల మునక: నీటిపారుదల శాఖ
TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా 773 చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడినట్లు నీటిపారుదల శాఖ గుర్తించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్ హౌస్, భక్త రామదాసు ఎత్తిపోతల పథకంలోని పంప్ హౌస్ మునిగిపోయాయని తెలిపింది. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.75 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.483 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక అందించింది.
News September 15, 2024
నెలాఖరులోగా ‘నామినేటెడ్’ భర్తీ!
AP: భారీ వర్షాలు, వరదలతో వాయిదా పడిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే 80% పోస్టులపై కసరత్తు పూర్తవగా, మిగతా వాటిపై కూటమి నేతలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. TDP, JSP, BJPలకు 60:30:10 రేషియోలో పంపకాలు ఉంటాయని సమాచారం. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తవుతుందని, గత ప్రభుత్వంపై పోరాటం, కూటమి గెలుపు కోసం కీలకంగా పనిచేసినవారికే ప్రాధాన్యత ఉంటుందని కూటమి వర్గాలు తెలిపాయి.
News September 15, 2024
19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?
AP: ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్త మద్యం పాలసీపై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. OCT 1 నుంచి పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని CM, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.