News September 20, 2024
లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 26/3

చెన్నై టెస్టులో బంగ్లా బ్యాటర్లు తడబడుతున్నారు. బుమ్రా 1, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయడంతో 26 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమ్ ఇండియా 376 రన్స్ చేసి ఆలౌటైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News January 27, 2026
మున్సి’పోల్స్’.. ఇవాళో రేపో షెడ్యూల్?

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ సాయంత్రం లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఈరోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎలక్షన్స్కు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్నికల ప్రక్రియ (నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు) అంతా 15 రోజుల్లోనే పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News January 27, 2026
ఈ రామకృష్ణ తీర్థంలో స్నానమాచరిస్తే..?

మాఘ పౌర్ణమి సందర్భంగా FEB 1న తిరుమలలోని రామకృష్ణ తీర్థంలో పుణ్య స్నానం ఆచరిస్తే ‘మాఘ స్నాన’ ఫలం దక్కి, సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మోక్షం లభిస్తుందని సూచిస్తున్నారు. అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే పాపాలను ఈ స్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పుణ్య స్నానం ఆధ్యాత్మిక శుద్ధిని ప్రసాదించి సత్మార్గంలో నడిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 27, 2026
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణ

తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. తోటలో చెట్ల పాదుల్లో ఎకరాకు 8-10KGల బ్లీచింగ్ పౌడరును చల్లాలి. మొక్కలలో తెగులు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి బ్లైటాక్స్ 3గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 0.2గ్రా కలిపి మొక్క బాగాలు తడిచేటట్లు స్ప్రే చేయాలి. ఈ మందులు పిచికారీ చేసిన వారం, 10 రోజుల తర్వాత కాసుగామైసిన్ (లీటరు నీటికి 3ml)ను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.


