News September 20, 2024
లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 26/3

చెన్నై టెస్టులో బంగ్లా బ్యాటర్లు తడబడుతున్నారు. బుమ్రా 1, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయడంతో 26 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 376 రన్స్ చేసి ఆలౌటైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News November 19, 2025
HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
News November 19, 2025
పిల్లల్లో జలుబు తగ్గించే చిట్కాలు ఇవే

* పిల్లలను హైడ్రేట్ చేయడానికి గోరు వెచ్చని నీరు, సూప్స్, కొబ్బరి నీళ్లు ఇవ్వండి. దీనివల్ల వారి శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. * తల కాస్త ఎత్తులో పెట్టుకుని పడుకునేలా చేయండి. * సెలైన్ నాజిల్ డ్రాప్స్ వాడండి. ఏడాది లోపు పిల్లల ముక్కులో నాలుగైదు గంటలకోసారి 2 డ్రాప్స్, అంతకంటే పెద్ద పిల్లల్లో 3-4 డ్రాప్స్ వేయండి. * విటమిన్-C ఉండే జామ, కివీ, ఆరెంజ్ పండ్లు ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.


