News August 5, 2024

బంగ్లా‌దేశ్: ప్రభుత్వ పెద్దగా ఓ ప్రొఫెసర్?

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా రచయిత, ప్రొఫెసర్ సలీముల్లా ఖాన్ ఉంటారని సమాచారం. ఆర్మీ చీఫ్‌తో సమావేశంలో పాల్గొన్న BNP నేత ద్వారా ఈ విషయం తెలిసింది. మిగతా సభ్యులు వీరే. Dr ఆసిఫ్ నజ్రుల్, Rtd జస్టిస్ అబ్దుల్ వహాబ్, Rtd జనరల్ కరీమ్, Rtd మేజర్ జనరల్ సయ్యద్ ఇఫ్తిఖార్, Dr దేబప్రియా భట్టాచార్య, మతియూర్ రెహ్మాన్, Rtd బ్రిగేడియర్ జనరల్ షెకావ్ హుస్సేన్, Dr జిల్లూర్ రెహ్మాన్, Rtd జస్టిస్ మాటిన్

Similar News

News November 22, 2025

శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

image

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 22, 2025

సమీకృత దాణాతో పశువులకు కలిగే మేలు

image

పశువుల పోషణలో భాగంగా పాడిపశువులకు సమతుల ఆహారం అందించడం ముఖ్యం. రోజూ అందించే దాణాతో పాటు సమీకృత దాణా కూడా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉన్న దినుసులను తగిన మోతాదులో కలిపి సమీకృత దాణాను తయారు చేయవచ్చు. ఇలా స్వయంగా తయారు చేసుకున్న దాణాలో మెులాసిస్ అరోమా పొడిని 250-500 గ్రాములు కలిపితే దాణా సువాసన కలిగి, రుచిగా ఉంటుంది.