News August 5, 2024
బంగ్లాదేశ్: ప్రభుత్వ పెద్దగా ఓ ప్రొఫెసర్?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా రచయిత, ప్రొఫెసర్ సలీముల్లా ఖాన్ ఉంటారని సమాచారం. ఆర్మీ చీఫ్‌తో సమావేశంలో పాల్గొన్న BNP నేత ద్వారా ఈ విషయం తెలిసింది. మిగతా సభ్యులు వీరే. Dr ఆసిఫ్ నజ్రుల్, Rtd జస్టిస్ అబ్దుల్ వహాబ్, Rtd జనరల్ కరీమ్, Rtd మేజర్ జనరల్ సయ్యద్ ఇఫ్తిఖార్, Dr దేబప్రియా భట్టాచార్య, మతియూర్ రెహ్మాన్, Rtd బ్రిగేడియర్ జనరల్ షెకావ్ హుస్సేన్, Dr జిల్లూర్ రెహ్మాన్, Rtd జస్టిస్ మాటిన్
Similar News
News September 15, 2024
సవాలుగా మారిన బోట్ల తొలగింపు
AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడు విధాలుగా ప్రయత్నించినప్పటికీ అధికారులకు నిరాశే ఎదురైంది. కట్ చేసిన బోట్లు బయటకు వచ్చినట్లే వచ్చి నీట మునిగాయి. దీంతో పడవలను బయటకు తీసేందుకు మరో ప్లాన్‌ను అబ్బులు టీమ్ రెడీ చేస్తోంది. ప్రస్తుతానికి పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు నీట మునిగిన పడవలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగించనున్నారు.
News September 15, 2024
రూ.2 లక్షలపైన రుణమాఫీ.. సీఎం కీలక ప్రకటన
TG: రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోపల రూ.2 లక్షల వరకు రుణమాఫీ హామీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తాడిచెట్టులా పెరిగిన ఓ వ్యక్తి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని విమర్శించారు. హరీశ్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ పోతుందని తాము సవాల్‌ను స్వీకరించామన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
News September 15, 2024
రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్: కేంద్రమంత్రి
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నంబర్ వన్ టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలని అన్నారు. సిక్కులను రాహుల్ విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.