News December 23, 2024
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లా

దేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌ను బంగ్లా మధ్యంతర ప్రభుత్వం అధికారికంగా కోరింది. భారత్‌తో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం మేరకు న్యాయపరమైన ప్రక్రియ కోసం ఆమెను అప్పగించాల్సిందిగా కోరినట్టు బంగ్లా దేశ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హసీనా హయాంలో చెలరేగిన అల్లర్లలో జరిగిన హత్య కేసుల్లో ఆమెపై ఇప్పటికే అభియోగాలు మోపారు.
Similar News
News April 19, 2026
‘జంబలకిడిపంబ’… బరాత్‌తో వధువు ఎంట్రీ ఆ తర్వాత..

పెళ్లి జరిగింది, అప్పగింతలు అవుతున్నాయి.. కట్ చేస్తే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంది వధువు కాదు వరుడు! ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలోని సుపల్గా అనే గ్రామంలో ఈ సీన్ కనిపించింది. కొడుకులు లేకపోవడంతో కూతురిని వీడలేక వధువు తండ్రి సంబంధం టైమ్‌లోనే ఇల్లరికం ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో అమ్మాయి ఊరేగింపుగా రావడం.. అబ్బాయిని పెళ్లాడి ఆమెతో పుట్టింటికి తీసుకుపోవడం జరిగాయి.

US ఆర్మీని ఓడించడానికి సిద్ధం: మొజ్తబా

ఇరాన్-అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే <<19685626>>రెచ్చగొట్టే<<>> పనిలో ఇరు దేశాల నాయకులు ఉన్నారు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US ఇప్పటికీ దిగ్బంధిస్తుండటంతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ మళ్లీ <<19682480>>మూసేసిన<<>> విషయం తెలిసిందే.