News August 10, 2024
ఉద్రిక్తత నడుమ బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశం వివాదాస్పదమైంది. వీరంతా కుట్రలో భాగమని ఆరోపిస్తూ వందలాదిగా నిరసనకారులు సుప్రీం కోర్టును చుట్టుముట్టారు. గంటలోనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెళ్లిపోయారని వార్తలు వచ్చినా చివరికి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన హసీనాకు అనుచరుడని పేరుంది.
Similar News
News October 14, 2025
వీటికి దూరంగా ఉంటే సంతోషమే!

మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం, గుసగుసలు మాట్లాడటం, ఈర్ష్య, ఎదుటివారితో పోల్చుకోవడం, అతి వ్యసనాలు, అనుమానం, భయం, ద్వేషం’ వంటివి ‘మానసిక క్యాన్సర్ల’తో సమానం అని చెబుతున్నారు. ఇవి మన మనసును, శరీరాన్ని నెమ్మదిగా కుంగదీస్తాయంటున్నారు. వీటికి దూరంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు. మీరేమంటారు?
News October 14, 2025
రాశులు చెబుతున్న జీవిత పాఠాలు

మేషంలా తినాలి. వృషభంలా పౌరుషాన్ని ప్రదర్శించాలి. మిథునంలా కలిసిపోవాలి. కర్కాటకంలా పట్టు విడవకూడదు. సింహంలా పరాక్రమించాలి. కన్యలా సిగ్గుపడాలి. తులలా సమన్యాయం పాటించాలి. వృశ్చికంలా చెడుపై కాటేయాలి. ధనస్సులా లక్ష్యాన్ని ఛేదించాలి. మకరంలా దృఢంగా పట్టుకోవాలి. కుంభంలా నిండుగా ఉండాలి. మీనంలా సంసార సాగరంలో జీవించాలి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను <<-se_10008>>జ్యోతిషం<<>> కేటగిరీకి వెళ్లి చూడొచ్చు.
News October 14, 2025
తిరుమల: సీఐడీ విచారణ మొదలు

AP: HC ఆదేశాలతో తిరుమల ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణను CID ప్రారంభించింది. పరకామణి, ఆపై చోరీ కేసు నమోదైన తిరుమల వన్టౌన్ PSలో రికార్డులను చెక్ చేసింది. CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. 2023 MARలో 920డాలర్లు దొంగిలిస్తూ TTD ఉద్యోగి రవి పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై TTD పూర్తిస్థాయి దర్యాప్తు చేయలేదని పిల్ దాఖలు కాగా హైకోర్టు విచారణకు ఆదేశించింది.