News August 10, 2024

ఉద్రిక్తత నడుమ బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

image

బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశం వివాదాస్పదమైంది. వీరంతా కుట్రలో భాగమని ఆరోపిస్తూ వందలాదిగా నిరసనకారులు సుప్రీం కోర్టును చుట్టుముట్టారు. గంటలోనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెళ్లిపోయారని వార్తలు వచ్చినా చివరికి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన హసీనాకు అనుచరుడని పేరుంది.

Similar News

News September 19, 2024

Stock Market: ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు

image

ఫెడ్ వ‌డ్డీ రేట్ల కోత‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 83,264 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 25,445 వద్ద స్థిరపడ్డాయి. ఆరంభ లాభాలను సూచీలు నిలుపుకోలేకపోయాయి. నిఫ్టీ 25,612 వ‌ద్ద‌- సెన్సెక్స్ 83,773 వ‌ద్ద రివ‌ర్స‌ల్‌ తీసుకున్నాయి. సూచీలు ఏ సెషన్‌లోనూ Day High క్రాస్ చెయ్య‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

News September 19, 2024

వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల విరాళం

image

AP: విజయవాడ వరద బాధితులకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.25 కోట్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ సంస్థ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ‘ఏపీలో వరదల కారణంగా అపార నష్టం సంభవించడం బాధాకరం. అదానీ గ్రూప్ తరఫున రాష్ట్ర ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం’ అని అదానీ ట్వీట్ చేశారు.

News September 19, 2024

అశ్విన్ హాఫ్ సెంచరీ

image

బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్ అశ్విన్ అదరగొడుతున్నారు. టాప్ బ్యాటర్లు విఫలమైన పిచ్‌పై బ్యాటుతో రాణించి హాఫ్ సెంచరీ చేశారు. 58బంతుల్లో 50 రన్స్ చేశారు. 144/6 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మరో ఎండ్‌లో జడేజా(34) ఉన్నారు. వీరిద్దరు 102 బంతుల్లో 89 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 233/6గా ఉంది.