News February 26, 2025

శివలింగాలకు బంగ్లాదేశ్ క్రికెటర్ అభిషేకం

image

మహా శివరాత్రి సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బంగ్లాదేశ్‌ హిందూ ఫ్యామిలీకి చెందిన ఆయన ఓ ఆలయంలో ఉన్న శివ లింగాలకు స్వయంగా అభిషేకం చేసిన ఫొటోలు షేర్ చేశారు. ఇటీవల బంగ్లాలో హిందువులపై జరిగిన దాడుల్లో ఆందోళనకారులు లిట్టన్ ఇంటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆలయానికి వెళ్లి పూజలు చేసి ట్వీట్ చేయడంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.

Similar News

News March 20, 2025

వేసవిలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త!

image

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు పలు సూచనలు చేశారు. 1. టైర్లలో ఎయిర్ ప్రెషర్‌ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే వేడికి టైర్లు పేలిపోయే అవకాశం ఉంది. 2. ఇంజిన్ కూలెంట్ స్థాయిని చెక్ చేయండి. అవసరమైతే రీఫిల్ చేయండి. 3. బ్యాటరీ స్థితిని తనిఖీ చేయండి. 4. ఏసీ వ్యవస్థ పనిచేస్తుందో లేదో చూడండి.
* పగటిపూట ప్రయాణాలు మానుకోండి: పోలీసులు

News March 20, 2025

ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

image

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.

News March 20, 2025

చరిత్ర సృష్టించిన ‘ఛావా’

image

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్‌ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.

error: Content is protected !!