News March 12, 2025
బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా రిటైర్మెంట్

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్టులు, 2024లో టీ20లకు గుడ్ బై పలికారు. ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకున్నారు. బంగ్లా తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,047 పరుగులు చేశారు. 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
Similar News
News February 9, 2026
మచిలీపట్నంలో ‘వందేమాతరం’ కోస్టల్ సైక్లోథాన్ ప్రారంభం

మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో CISF ఆధ్వర్యంలో సోమవారం ‘వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ మెగా సైకిల్ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. దేశ రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ సుమారు 6,500 కి.మీ మేర సాగే ఈ భారీ యాత్రను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తీర ప్రాంత భద్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం.
News February 9, 2026
వివాదాస్పద బుక్.. లీకేజీపై దర్యాప్తు

లోక్‌సభలో <<19052501>>ప్రకంపనలు<<>> రేపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఆత్మకథ పుస్తకం ఎలా లీకైందనేదానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. FIR నమోదు చేసి PDF కాపీ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి నిజాలు ఇందులో రాశారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ పబ్లిష్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నారు. కేంద్ర ఆమోదం లభించకపోవడంతో ఈ పుస్తకం పబ్లిషింగ్ నిలిచిపోయింది.
News February 9, 2026
పాపం.. ఇషాన్ కిషన్!

దేశవాళీ ప్రదర్శనతో T20 WC జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్‌పై BCCI దయ చూపలేదు. తాజాగా రిలీజ్ చేసిన <<19095739>>సెంట్రల్ కాంట్రాక్ట్<<>> లిస్టులో అతనికి చోటు కల్పించలేదు. దీంతో కిషన్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రంజీల్లో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేశారని 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇతనితో పాటు శ్రేయస్‌ను BCCI తొలగించింది. అయితే తాజా లిస్టులో అయ్యర్ గ్రేడ్-Bలో ఉన్నారు.


