News August 4, 2024
బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. 91కి చేరిన మృతుల సంఖ్య

బంగ్లాదేశ్‌లో ప్రధానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన వేళ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 91 మంది చనిపోగా మరో 300 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది పోలీసులు ఉన్నారు. సిరాజ్‌గంజ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడిలోనే 13 మంది పోలీసులు మృతిచెందారు. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేసిన అక్కడి ప్రభుత్వం, మూడు రోజులు సెలవులు ప్రకటించింది.
Similar News
News December 9, 2025
స్టార్ బ్యాటర్ అంజుమ్ చోప్రా గురించి తెలుసా?

ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా ఉన్న అంజుమ్ చోప్రా గతంలో భారత జట్టులో కీలకపాత్ర పోషించారు. 18 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఈ దిల్లీ క్రికెటర్ IND తరఫున 100 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. స్టార్ బ్యాటర్ అయిన ఆమె నాలుగు ప్రపంచ కప్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం మీద 127 వన్డేలు, 12 టెస్టులు, 18 టీ20లు ఆడారు. 2007లో అర్జున అవార్డు, 2014 పద్మశ్రీ అందుకున్నారు.
News December 9, 2025
పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని రెండ్రోజులకోసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.
News December 9, 2025
ఘోరం: భార్య మగ పిల్లాడిని కనలేదని..

టెక్నాలజీ ఎంత పెరిగినా కొందరిలో మూఢనమ్మకాలు పోవట్లేదు. కర్ణాటక విజయపుర(D)లో భార్య ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఆమెకు శిరోముండనం చేసి వెంట్రుకలను శ్మశానంలో కాల్చేశాడో భర్త. బ్లేడుతో కట్ చేయడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. భార్యలో దెయ్యం ఉందని, అందుకే మగ పిల్లాడు పుట్టలేదని ఓ మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి భర్త డుండేశ్‌ను అరెస్టు చేశారు.


