News August 6, 2024
BANGLADESH: జూలో జంతువులేం చేశాయ్?

బంగ్లాదేశ్‌లో నిరసనకారులు ప్రవర్తిస్తోన్న తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ జూలోకి ప్రవేశించి అక్కడున్న జంతువులను కొందరు చిత్రహింసలకు గురిచేశారు. జింకను పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకున్న వీడియో వైరలవుతోంది. ఢాకాలోని షేక్ హసీనా తండ్రి షేక్ ముజ్బిర్ రెహ్మాన్ విగ్రహంపైకి ఎక్కి ఓ వ్యక్తి మూత్రం పోసి నిరసన తెలిపాడు. దీనిని అక్కడున్నవారంతా సపోర్ట్ చేస్తూ నినాదాలు చేయడం గమనార్హం.
Similar News
News February 8, 2026
రేవంత్‌ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట: బండి సంజయ్

TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అన్ని పన్నులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. ఢిల్లీ వెళ్తే రేవంత్‌ను అందరూ చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట. అలాంటి వ్యక్తికి ఎవరైనా నిధులిస్తారా? ‘ అని చొప్పదండి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. తనకు బీపీ, షుగర్ లేవని, తన వల్ల KCRకి అవి వచ్చాయని పేర్కొన్నారు.
News February 8, 2026
జైపూర్‌లోని ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

జైపూర్‌లోని <
News February 8, 2026
JEE మెయిన్ ‘కీ’లో 17 తప్పులు? బోనస్ మార్కుల కోసం డిమాండ్

JEE మెయిన్ 2026 సెషన్-1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లో 17 తప్పులున్నాయని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఫిజిక్స్‌లో ఎక్కువ పొరపాట్లు దొర్లాయని, వీటి వల్ల విద్యార్థుల ర్యాంకులు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుగా ఉన్న 10 ప్రశ్నలకు బోనస్ మార్కులు ఇవ్వాలని, మిగిలిన 7 ప్రశ్నల సాంకేతిక లోపాలను సరిదిద్దాలని NTAను డిమాండ్ చేసింది. Feb 12న తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.


