News August 6, 2024

BANGLADESH: జూలో జంతువులేం చేశాయ్?

image

బంగ్లాదేశ్‌లో నిరసనకారులు ప్రవర్తిస్తోన్న తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ జూలోకి ప్రవేశించి అక్కడున్న జంతువులను కొందరు చిత్రహింసలకు గురిచేశారు. జింకను పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకున్న వీడియో వైరలవుతోంది. ఢాకాలోని షేక్ హ‌సీనా తండ్రి షేక్ ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహంపైకి ఎక్కి ఓ వ్యక్తి మూత్రం పోసి నిరసన తెలిపాడు. దీనిని అక్కడున్నవారంతా సపోర్ట్ చేస్తూ నినాదాలు చేయడం గమనార్హం.

Similar News

News July 10, 2025

ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

image

బిహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌కు ఆధార్, ఓటర్ ID, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిటిజన్‌షిప్ నిర్ధారణకు JUN 24న ECI సబ్మిట్ చేసిన 11రకాల డాక్యుమెంట్లు కూడా సమగ్రమైనవి కాదంది. సిటిజన్‌షిప్ నిర్ధారించాల్సింది ECI కాదని పేర్కొంది. JUL 21లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను JUL 28కి వాయిదా చేసింది.

News July 10, 2025

మోదీ, జగన్ మధ్య అక్రమ పొత్తు: YS షర్మిల

image

AP: మోదీకి జగన్ దత్తపుత్రుడు అని, వారి మధ్య అక్రమ పొత్తు ఉందని షర్మిల ఆరోపించారు. ‘మోదీ మద్దతుతో జగన్ ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. తలకాయల మీద కార్లు పోనిచ్చినా, మామిడి కాయలు తొక్కుకుంటూ వెళ్లినా, రప్పా రప్పా నరుకుతామని హెచ్చరించినా చీమంత చర్య కూడా ఉండదు’ అని ట్వీట్ చేశారు. జగన్ పర్యటనకు పైకి 500 మందితో అనుమతి ఇస్తారు కానీ 10వేల మందితో వచ్చినా కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె విమర్శించారు.

News July 10, 2025

టాస్ ఓడిన భారత్.. జట్టులోకి బుమ్రా

image

లార్డ్స్‌ వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. IND(XI): జైస్వాల్, రాహుల్, నాయర్, గిల్, పంత్(Wk), జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, నితీశ్. ENG(XI): క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్(Wk), వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.