News August 17, 2024
26 కిలోల బంగారంతో బ్యాంకు మేనేజర్ పరార్
కేరళలో సుమారు 26 కిలోల బంగారంతో ఓ బ్యాంకు మేనేజర్ పరారయ్యారు. కోలీకోడ్ జిల్లా ఇడోడిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ మధు జయకుమార్ ఇటీవల వేరే బ్యాంకుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీ తర్వాత చేపట్టిన సోషల్ ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. అధికార దుర్వినియోగంతో బ్యాంకు మేనేజర్ ఈ బంగారాన్ని విడతలవారీగా తస్కరించినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నారు.
Similar News
News September 13, 2024
కౌశిక్‌ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే దానం
TG: BRS MLA కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. ‘కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ స్టాండా? వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
News September 13, 2024
UNలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం: అమెరికా
UN భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్యత్వాలతో పాటు 2 శాశ్వత సభ్యత్వాల సృష్టికి తమ మద్దతు కొనసాగుతుందని UNలో US అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్. మండలిలో నిజంగానే వారికి మేం మద్దతిస్తాం. వారి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులే లేవు’ అని అన్నారు.
News September 13, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
AP: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇటు టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది.