News March 17, 2024
బాపట్ల: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల మండల పరిధిలోని కొత్తపాలెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 17, 2026
సోలార్ దరఖాస్తుల్లో గుంటూరు జోరు!

పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెళ్ల కోసం గుంటూరులో ఏకంగా 1.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలకు ఈ యూనిట్లు ఉచితం. ఇతరులకు కేంద్రం రూ. 60 వేల రాయితీ ఇస్తోంది. దరఖాస్తుల్లో 30 శాతం వరకు బీసీలవే ఉన్నాయి. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 20 వేల సబ్సిడీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రాయితీ మార్గదర్శకాల కోసం గుంటూరు లబ్ధిదారులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
News April 17, 2026
GNT: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

2027 పద్మ పురస్కారాలకు గానూ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎస్‌వో అఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తిగలవారు తమ పత్రాలను వర్డ్, పీడీఎఫ్ ఫార్మాట్‌లో మే 15లోపు sportsinap@gmail.comకు మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకు awards.gov.in చూడొచ్చు. ఎంపిక చేసిన అర్హుల జాబితాను కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు.
News April 17, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ వసతులు కల్పించాలి: లోకేశ్

ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ కీలక సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముఖ ఆధారిత గుర్తింపు పురోగతిపై ఆరా తీశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై చర్చించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు.


