News April 3, 2025
లోకేశ్ సభలో బారికేడ్లు, పరదాలు.. వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

AP: మంత్రి లోకేశ్ సభలో గ్రీన్మ్యాట్లు, బారికేడ్లు, పరదాలు ఉండటంపై YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ‘గ్రీన్ మ్యాట్లు వేస్తే గ్రాఫిక్స్ కోసం, పరదాలు కడితే అప్రజాస్వామ్యం, బారికేడ్లు పెడితే ప్రజలకు భయపడి, ఫొటోగ్రాఫర్స్ ఉంటే ప్రచార పిచ్చి.. ఇవి వైఎస్ జగన్ CMగా ఉన్నప్పుడు లోకేశ్ వాడిన పదజాలం. నేడు ఆయన కార్యక్రమానికి అవే పదాలు వర్తించవా?’ అని ప్రశ్నిస్తూ ఓ ఫొటోను షేర్ చేశారు.
Similar News
News April 4, 2025
అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా?: రాజా సింగ్

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల BJP ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలు, అధిష్ఠానంపై మండిపడ్డారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు లేరా? అని ప్రశ్నించారు. అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డా.ఎన్.గౌతమ్ రావును MLC అభ్యర్థిగా BJP బరిలో నిలిపిన విషయం తెలిసిందే.
News April 4, 2025
సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

AP: రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన <<15986572>>అగ్నిప్రమాదం<<>>పై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్లో ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఫైర్ ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
News April 4, 2025
అవి తప్పుడు వార్తలు.. మేం విప్ జారీ చేశాం: వైసీపీ

AP: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా వైసీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేయలేదని వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, తాము అధికారికంగా విప్ జారీ చేశామని ట్వీట్ చేసింది. కొందరు రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తాము సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ స్పష్టం చేసింది.