News July 27, 2024
పాక్ సైనికులు, ఉగ్రవాదులు కలిస్తేనే BATs (1/3)

ఏ దేశమైనా ఉగ్రవాదులను ఏరిపారేయాలని అనుకుంటుంది. ఒక్క పాకిస్థానే వారితో కలిసి పనిచేసేందుకు ఇష్టపడుతుంది. అందుకే భారత్‌లోకి చొరబడేందుకు బోర్డర్ యాక్షన్ టీమ్స్‌ను (BAT) ఏర్పాటు చేసింది. ఇందులో పాక్ సైనికులతో పాటు లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ వంటి కరుడుగట్టిన తీవ్రవాదులూ ఉంటారు. LOC దాటి జమ్మూకశ్మీర్లో దాడులకు తెగబడటమే వీరి ఉద్దేశం. అందుకే హోం మినిస్ట్రీ అక్కడ జవాన్లతో ఏరివేత మిషన్ మొదలుపెట్టింది.
Similar News
News February 25, 2025
WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదైంది. బెంగళూరు, యూపీ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత RCB 180 రన్స్ చేసింది. ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ జరగనుంది.
News February 25, 2025
ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిది?

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.
News February 24, 2025
బంగ్లాపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్‌కు భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలోనే ఛేదించింది. రచిన్ రవీంద్ర (112) సెంచరీతో విజృంభించారు. 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం చేశారు. ఒక దశలో 72/3తో కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర ఆదుకున్నారు. కాగా ఈ ఫలితంతో పాక్, బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్, కివీస్ సెమీస్‌కు దూసుకెళ్లాయి.