News January 29, 2025
టెస్టుల్లో 10,000+ రన్స్ చేసిన బ్యాటర్లు

సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), కలిస్ (13,289), రాహుల్ ద్రవిడ్ (13,288), జో రూట్ (12,972), అలిస్టర్ కుక్ (12,472), సంగక్కర (12,400), బ్రియాన్ లారా (11,953), చందర్‌పాల్ (11,867), జయవర్ధనే (11,814), బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927), సునీల్ గవాస్కర్ (10,122), యూనిస్ ఖాన్ (10,099), <<15298706>>స్టీవ్ స్మిత్<<>> (10,009*).
Similar News
News February 11, 2025
డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్‌కు ఊరట

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారు. అతనితోపాటు మరో ఆరుగురిని కొచ్చి అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015, జనవరి 30న ఓ ఫ్లాట్‌లో కొకైన్ తీసుకున్నారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది. దసరా మూవీతో ఇతను టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
News February 11, 2025
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్… ఆ వాహనాలకు నో ఎంట్రీ

APలో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్నకోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 24చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ పై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఈవైరస్ సోకి వేలసంఖ్యలో కోళ్లు మృతిచెందిన సంగతి తెలిసిందే.
News February 11, 2025
సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశానికి ఆయన వచ్చిన 10 నిమిషాల తర్వాత మంత్రులు, అధికారులు తాపీగా రావడంతో సీబీఎన్ వారందరికీ క్లాస్ తీసుకున్నారు. సమయపాలన లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఇక నుంచి ఇలాంటివి సహించేది లేదని తేల్చిచెప్పారు.