News March 30, 2024
ఈ పిచ్పై ఫస్ట్ బ్యాటింగ్ కష్టం: అయ్యర్

RCBపై గెలుపు తర్వాత KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. మొదటి ఇన్నింగ్స్లో బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బౌండరీలు కొట్టడం చాలా కష్టమైంది. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది’ అని చెప్పారు. RCB ఓటమికి ఇదే కారణమని, ఒకవేళ ఛేజింగ్ అయితే పక్కా గెలిచేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు?
Similar News
News December 17, 2025
పూజలతో బ్రహ్మ రాసిన రాతను మార్చొచ్చా?

‘అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు పూజలు ఎందుకు చేయాలి?’ అనే సందేహం కొందరిలో ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు నుదుటిపై రాత రాసేటప్పుడు ‘నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ ఉపాసన, ఆరాధన, అర్చనల ద్వారా ఆ విధిని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని కూడా రాశాడట. కాబట్టి, మన అర్చనలు, ఉపాసనలు, కర్మల ద్వారా మన విధిని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది.
News December 17, 2025
సర్పంచ్ ఫలితాలు.. 3 ఓట్ల తేడాతో గెలుపు

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా గాంధీనగర్లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. NZB జిల్లా బాన్సువాడ మం. నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి (D) జగన్నాథ్పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
News December 17, 2025
ఢిల్లీ కాలుష్యానికి వాహనాలూ ప్రధాన కారణం: సుప్రీంకోర్టు

ఢిల్లీలో గాలి కాలుష్యం సంక్షోభానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది. కాలుష్య స్థాయులను సమర్థవంతంగా అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని కామెంట్లు చేసింది. ట్రాఫిక్ జామ్లపై NHAIకి నోటీసులు జారీ చేసింది.


