News March 30, 2024
ఈ పిచ్‌పై ఫస్ట్ బ్యాటింగ్ కష్టం: అయ్యర్

RCBపై గెలుపు తర్వాత KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బౌండరీలు కొట్టడం చాలా కష్టమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది’ అని చెప్పారు. RCB ఓటమికి ఇదే కారణమని, ఒకవేళ ఛేజింగ్ అయితే పక్కా గెలిచేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు?
Similar News
News April 18, 2026
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో రోజువారీ నమోదవుతున్న ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News April 18, 2026
ఇరాన్, లెబనాన్‌లో మేం సాధించింది ఇదే: ఇజ్రాయెల్

ఇరాన్, లెబనాన్‌పై దాడుల్లో తాము సాధించిన విజయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. ఇరాన్‌లో 28 మంది సీనియర్ లీడర్లను అంతం చేశామని, 10,800 దాడులు చేశామని తెలిపింది. 250 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను నాశనం చేశామని వెల్లడించింది. అటు లెబనాన్‌లో 1700 మందికి పైగా టెర్రరిస్టులను చంపేశామని, 5 వేలకు పైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వివరించింది.
News April 18, 2026
‘వారణాసి’పై ఎండల ఎఫెక్ట్!

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘వారణాసి’ కీలక షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నేతృత్వంలో మహేశ్‌పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే మూవీ యూనిట్ మే నెలలో సమ్మర్ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహేశ్, జక్కన్న తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారట. ఆ తర్వాత జూన్ నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం.


