News April 11, 2024
నరసరావుపేటలో సమవుజ్జీల సమరం

AP: రాజకీయ హేమాహేమీలు పోటీ చేసి గెలుపొందిన పార్లమెంట్ స్థానం పల్నాడు(D) నరసరావుపేట. ఈసారి ఇక్కడ సమవుజ్జీల పోటీ ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు సిటీ MLA అనిల్ కుమార్ యాదవ్‌ను YCP బరిలోకి దింపింది. గతంలోనూ నెల్లూరు జిల్లా నేతలు ఇక్కడ పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉంది. ఇటు TDP నుంచి లావు కృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు. విజయంపై ఇద్దరు నేతలూ ధీమాగా ఉండగా.. యాదవ వర్గం ఓట్లు కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 17, 2025
అత్యధిక పన్ను చెల్లించే నటుడు ఎవరంటే?

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇన్కమ్‌ట్యాక్స్ చెల్లించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ రూ.52.50కోట్లు చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.350 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నాయి. తద్వారా రూ.120 కోట్లు పన్ను చెల్లించి అత్యధికంగా పన్ను చెల్లించిన నటుడిగా నిలిచినట్లు వెల్లడించాయి. 85 సంవత్సరాల వయసులోనూ ఆయన ఎంతో డిమాండ్ ఉన్న నటుడిగా ఉన్నారు.
News March 17, 2025
11 మంది సెలబ్రిటీలపై కేసులు

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.
News March 17, 2025
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.