News August 21, 2024
బీసీసీఐకి గత ఏడాది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం
BCCIకి గత ఏడాది IPL ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి పెట్టింది. గత సీజన్లో ఏకంగా రూ.5120 కోట్ల అదనపు ఆదాయం చేకూరింది. 2022తో(రూ.2367 కోట్లు) పోలిస్తే ఇది 116శాతం ఎక్కువ. గత ఏడాది బీసీసీఐ మొత్తం ఆదాయం రూ.11,769 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 78శాతం ఎక్కువ. మీడియా హక్కులు, స్పాన్సర్ షిప్ డీల్స్ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక ఖర్చు కూడా 66శాతం పెరిగి రూ.6468 కోట్లకు చేరింది.
Similar News
News September 14, 2024
పటిష్ఠంగానే ‘రాజధాని’ పునాదులు?
AP: ఐదేళ్లుగా నీటిలో నానుతున్న రాజధాని అమరావతిలోని భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై, HYD IIT నిపుణులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తుప్పు పట్టిన ఇనుము తొలగించి, కెమికల్ ట్రీట్‌మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించవచ్చనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నిపుణులు ఇటీవల రాజధాని నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే.
News September 14, 2024
రోహిత్ నాకు అన్నయ్యలాంటివాడు: సర్ఫరాజ్
బాలీవుడ్ సినిమా లగాన్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర తరహాలో రోహిత్ శర్మ నిజజీవితంలో ఉంటారని క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నారు. జట్టులో అందర్నీ గౌరవంతో చూస్తారని పేర్కొన్నారు. ‘రోహిత్ చాలా విభిన్నమైన వ్యక్తి. మేం చాలా సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే నాకు అన్నయ్యలాంటి మనిషి. కొత్త కుర్రాళ్లను కూడా తనతో సమానంగానే ట్రీట్ చేస్తారు. ఆయన కెప్టెన్సీలో ఆడటాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నాం’ అని తెలిపారు.
News September 14, 2024
‘టైమ్’ బెస్ట్ కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్
2024లో ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాను టైమ్ సంస్థ తాజాగా విడుదల చేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన 8 సంస్థలకు అందులో చోటు దక్కింది. స్టాటిస్టాతో కలిసి 50 దేశాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు టైమ్ పేర్కొంది. పని పరిస్థితులు, జీతం, సమానత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించింది. కాగా.. ఉద్యోగుల పట్ల తమ నిబద్ధత, వ్యాపార రంగంలో దక్షతకు ఇది నిదర్శనమని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.