News August 6, 2024
BCCI కూడా పన్ను చెల్లిస్తోంది: కేంద్ర మంత్రి
బీసీసీఐ నుంచి ఎలాంటి ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదని నెట్టింట విమర్శలొస్తున్న వేళ కేంద్ర మంత్రి పంకజ్ కీలక విషయాలు వెల్లడించారు. 2023-24 FYలో GST ద్వారా బీసీసీఐ రూ.2,038.55 కోట్లు చెల్లించిందని తెలిపారు. BCCIని నాన్ ప్రాఫిటబుల్ సంస్థగా ఏర్పాటు చేయడంతో ఆదాయపన్ను చట్టం సెక్షన్ 11 ప్రకారం BCCIకి పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ అసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌ల సమయంలో పన్ను చెల్లించాల్సిందేనని తెలిపారు.
Similar News
News September 10, 2024
13-04-2029: భూమికి అత్యంత సమీపానికి భారీ గ్రహశకలం
అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తోన్న ఓ భారీ గ్రహశకలాన్ని ఇస్రో పర్యవేక్షిస్తోంది. దీనిని ఈజిప్ట్ దేవుడు ‘అపోపిస్’ పేరుతో సైంటిస్టులు పిలుస్తున్నారు. 2029 ఏప్రిల్ 13న భూమికి కేవలం 32,000 కిలోమీటర్ల సమీపంలో ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రహశకలం 340-450 మీటర్ల వ్యాసం ఉంటుందని తెలిపారు. 300 మీటర్ల కంటే పెద్దదైన గ్రహశకలం ఢీకొడితే ఓ ఖండం నాశనమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News September 10, 2024
ALERT: దీనిపై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యాక్!
కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. APK ఫైల్ పంపించి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రూ.74వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి APKఫైల్స్‌ను అస్సలు ఓపెన్ చేయకండి. SHARE IT
News September 10, 2024
‘క్యాన్సర్ భయం’ గుప్పిట్లో 60శాతానికి పైగా భారతీయులు
భారత్‌లో 60శాతానికి పైగా ప్రజలు క్యాన్సర్‌పై భయంతో బతుకుతున్నారని GOQii నిర్వహించిన సర్వేలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. తమకెక్కడ క్యాన్సర్ వస్తుందోనన్న టెన్షన్ 60శాతం భారతీయుల్లో కనిపిస్తోంది. చికిత్స ఉండదేమోనన్న ఆందోళన, మరణం-ఆర్థిక కష్టాల భయాలు వారిని వెంటాడుతున్నాయి. క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు దానిపై ఉన్న భయాందోళనల్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని నివేదిక అభిప్రాయపడింది.