News July 19, 2024
బీసీసీఐ మరో టీమ్‌ను ఎంపిక చేయాలి: ఫ్యాన్స్
శ్రీలంకతో సిరీస్‌కు <<13656178>>టీమ్‌ఇండియా<<>>లో చోటు దక్కని ప్లేయర్లతో BCCI మరో జట్టును ఎంపిక చేయాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐర్లాండ్, నేపాల్, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లతో వారిని ఆడించాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాన్స్ టీమ్: రుతురాజ్(C), అభిషేక్, ఇషాన్, పాటీదార్, సుదర్శన్, తిలక్, V చక్రవర్తి, నటరాజన్, చాహల్, ముకేశ్, అవేశ్. మీరు ఇంకెవరినైనా ఇందులో చేర్చాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి.
Similar News
News December 1, 2024
ఇది మహారాష్ట్రకు అవమానకరం: ఆదిత్య ఠాక్రే
ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం మహారాష్ట్రకు అవమానకరమని శివసేన UBT నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. అసెంబ్లీ గడువు ముగిసినా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని క్లైం చేసుకోకుండానే ప్రమాణస్వీకారానికి తేదీ ప్రకటించడం అరాచకమని మండిపడ్డారు. వర్లీ నుంచి ఆదిత్య గెలిచిన విషయం తెలిసిందే.
News December 1, 2024
రేపు చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తుగా సెలవు ఇచ్చారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
News December 1, 2024
ఈ జ్యూస్‌లను తాగకపోవడమే మంచిది: వైద్యులు
పండ్లు తినే బదులు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది కదా? అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఈ మూడింట్లో ఏది బెటరో వైద్యులు సూచించారు. ‘ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో అధిక మొత్తంలో షుగర్ ఉండటం వల్ల వాటిని సేవించొద్దు. తాజా పండ్ల రసాలు తాగడం వల్ల అధిక మొత్తంలో పండ్లు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆ జ్యూస్ తాగినా, తాజా పండ్లు తినేందుకే మొగ్గుచూపాలి’ అని డాక్టర్లు తెలిపారు.