News November 8, 2024
పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని పీసీబీకి బీసీసీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా అక్కడికి రాలేమని తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు భారత్ తమ దేశానికి వస్తుందని పాక్ ఊహల్లో విహరించింది. దీనిపై బీసీసీఐ స్పష్టతనివ్వడంతో దుబాయ్‌లో హైబ్రిడ్ విధానంలో మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 8, 2024
యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. అదీ ₹10 స్టాంప్ పేపర్‌తో
పై ఫొటోలో కనిపిస్తున్న ₹500 నోటు చూడటానికి ఒరిజినల్‌గా కనిపిస్తున్నా ఇది నకిలీది. అది కూడా ₹10 స్టాంప్ పేపర్‌ను ఉపయోగించి తయారు చేశారు. యూపీలోని సోన్‌భద్రా జిల్లాకు చెందిన సతీశ్ రాయ్, ప్రమోద్ మిశ్రా యాడ్స్ ప్రింటింగ్ రంగంలో పనిచేస్తున్నారు. వీరు యూట్యూబ్‌లో నోట్ల తయారీ నేర్చుకున్నారు. నకిలీ నోట్ల ప్రింటింగ్ ప్రారంభించి ఫర్జీ సిరీస్‌ను రియల్‌గా చూపించారు. చివరికి పోలీసులకు చిక్కారు.
News November 8, 2024
మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు: హరీశ్
KCR కాలిగోటికి కూడా సరిపోని రేవంత్ <<14562919>>CM<<>> స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. ‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి పద్యం CMకు సరిగ్గా సరిపోతుంది. KCRపై నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ దొంగబుద్ధిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తాం. ప్రగల్భాలు మాని పరిపాలనపై దృష్టి పెట్టు’ అని ట్వీట్ చేశారు.
News November 8, 2024
SAvsIND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
భారత్‌తో డర్బన్‌లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్, సంజూ, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్టన్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రూగర్, జాన్సెన్, సైమ్‌లేన్, కొయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్