News November 8, 2024
పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని పీసీబీకి బీసీసీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా అక్కడికి రాలేమని తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు భారత్ తమ దేశానికి వస్తుందని పాక్ ఊహల్లో విహరించింది. దీనిపై బీసీసీఐ స్పష్టతనివ్వడంతో దుబాయ్‌లో హైబ్రిడ్ విధానంలో మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 9, 2024
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వచ్చింది ఈరోజే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2009లో సరిగ్గా ఇదే రోజు కేంద్రం నుంచి తొలి ప్రకటన వెలువడింది. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11 రోజుల తర్వాత ఈ ప్రకటన రావడంతో బీఆర్ఎస్ ఈరోజును ఏటా ‘దీక్షా విజయ్ దివస్’గా నిర్వహిస్తోంది. ప్రజల పోరాటాన్ని చూసి చలించి ఈ ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. 2013 OCT3న కేంద్ర క్యాబినెట్ TG స్టేట్ ఏర్పాటుకు ఆమోదం తెలపగా, 2014 జూన్ 2న రాష్ట్రం అవతరించింది.
News December 9, 2024
కేరళలో BJP కొత్త గేమ్ ప్లాన్!
పదేళ్లలో కేరళలో పాగా వేయడానికి BJP ఒక స్ట్రాటజీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ హిందువులు 54, ముస్లిములు 27, క్రైస్తవులు 18% ఉన్నారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలవుతూ LDFను వీడుతున్న హిందూ, క్రైస్తవులను BJP చేరదీస్తోంది. క్రైస్తవ మత పెద్దలతో సమావేశమవుతూ మద్దతు సంపాదిస్తోంది. తాజాగా జార్జ్ జాకబ్ కూవకడ్ కార్డినల్ వేడుకకు ఓ బృందాన్ని వాటికన్‌కు పంపించింది.
News December 9, 2024
బాలిక నోట్లో దుస్తులు కుక్కి, పెట్రోల్ పోసి..
AP: నంద్యాల(D)లో ఇంటర్ విద్యార్థిని <<14828564>>హతమార్చిన<<>> ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని వెల్దుర్తి(M) కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న దుర్మార్గుడు ఇవాళ తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న బాలిక నోట్లో దుస్తులు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడే మృతి చెందింది. అతడు కూడా నిప్పటించుకోగా, పరిస్థితి విషమంగా ఉంది.