News February 15, 2025
BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పులతడకగా ఉందని BRS MLC కవిత ఆరోపించారు. ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ‘బీసీలకు 42శాతం కాదు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడమే బీజేపీ నేతల పని. జై భీమ్, జై బీసీ నినాదం ఒకచోటే ఉండాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News March 13, 2025
దస్తగిరికి భద్రత పెంపు

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
News March 13, 2025
రూపాయి గుర్తు ఎలా రూపొందించారంటే..

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ 2009 కేంద్ర బడ్జెట్ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్ లిస్ట్ చేసి DMK మాజీ MLA కుమారుడు, ప్రొఫెసర్ ఉదయ్ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र “ra”, లాటిన్ ఇంగ్లిష్లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో 2 సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.
PS: గతంలో Rs, Re, రూ. అని భిన్న రూపాయి సూచకాలుండేవి.
News March 13, 2025
అక్కడి మహిళలు 10 మందిని పెళ్లి చేసుకునే సంప్రదాయం: మంత్రి

ఉత్తర భారతంలో ఒక స్త్రీ 10మందిని వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని తమిళనాడు మంత్రి మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే దక్షిణ భారతంలో అటువంటి కల్చర్ లేదన్నారు. జనాభా నియంత్రణ విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో ఇక్కడి జనాభా తగ్గిందని, కానీ నార్త్ ఇండియాలో ఒకరు 10మందికి పైగా పిల్లల్ని కన్నారన్నారు. తమిళ సంస్కృతిని హేళన చేసేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారి నాలుక చీరేస్తానని మంత్రి హెచ్చరించారు.