News March 29, 2024
జాగ్రత్త.. బయటికి రావొద్దు!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడి భగభగలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు TN, KA, రాజస్థాన్, GT, మహారాష్ట్ర, కేరళలో వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News February 11, 2026
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.
News February 11, 2026
శివుడు లేని చోటు గలదా?

ఓ సముద్రంలో పుట్టిన అల, తను సముద్రం కంటే వేరు అనుకుంటుంది. అందుకే ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసి ఒడ్డుకు వస్తుంది. కానీ అలకు మూలం, ఆధారం, అంతం ఆ సముద్రమే! అలాగే ఈ జగత్తులో మనం చూసే ప్రతి రూపం ఆ మహాశివుడనే సముద్రంలో పుట్టిన చిన్న అల మాత్రమే. రూపం చూస్తే అది మనిషిలాగో లేదా రాయిలాగో కనిపిస్తుంది. కానీ దాని సారాన్ని చూస్తేనే అది శివతత్వం అని అర్థమవుతుంది. సర్వం శివమే అని నమ్మితే ఆయన అనుగ్రహం కలుగుతుంది.
News February 11, 2026
న్యూజిలాండ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం

T20 WCలో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఆదివారం వార్మప్ సమయంలో అతను గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్(NZC) తెలిపింది. బ్రేస్‌వెల్ స్థానంలో కోల్ మెక్‌కాంచీ రిజర్వ్ బౌలర్ బెన్ సియర్స్‌తో కలిసి జట్టులో చేరనున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్ తన మూడో మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.


