News February 16, 2025
వచ్చేవారం నుంచి జాగ్రత్త.. 38°Cకు ఉష్ణోగ్రతలు!

AP: రాష్ట్రంలో వచ్చేవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉందని Andhra Pradesh Weatherman తెలిపారు. మంగళవారం(18th feb) నుంచి గుంటూరు-విజయవాడ, అనకాపల్లి-విజయనగరం, కర్నూలు-కడప బెల్ట్‌లో ఉష్ణోగ్రతలు 38°C వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు, చలి.. మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం కనిపిస్తోంది. ప్రజలు తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News March 24, 2025
బీసీసీఐ కాంట్రాక్ట్స్: గ్రేడ్-Aలో హర్మన్, స్మృతి, దీప్తి

2024-25కు గాను ఉమెన్స్ క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. గ్రేడ్-Aలో హర్మన్, స్మృతి, దీప్తి చోటు దక్కించుకున్నారు. గ్రేడ్-Bలో రేణుక, జెమీమా, రిచా, షఫాలీ, గ్రేడ్-Cలో యస్తిక, రాధ, శ్రేయాంకా, టిటాస్, అరుంధతీరెడ్డి, అమన్‌జోత్, ఉమ, స్నేహ్ రాణా, పూజ ఉన్నారు. గ్రేడ్ల వారీగా వీరికి వరుసగా రూ.50L, రూ.30L, రూ.10L వార్షిక వేతనం అందుతుంది. ప్రతి మ్యాచ్‌కూ ఇచ్చే శాలరీ అదనం.
News March 24, 2025
పార్లమెంట్ సభ్యుల జీతాలు పెంపు

ప్రస్తుత, మాజీ పార్లమెంట్ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వారి జీతాలు, రోజువారీ భత్యం పెంచింది. ఇప్పటివరకూ ఉన్న రూ.లక్ష జీతాన్ని రూ.1.24 లక్షలకు పెంచింది. డైలీ అలవెన్స్ రూ.2వేల నుంచి రూ.2500కు, పెన్షన్‌ను రూ.25వేల నుంచి రూ.31వేలకు పెంచింది. అలాగే అదనపు పెన్షన్‌ను రూ.2500 చేసింది. ఇది APR 1, 2023 నుంచే అమల్లోకి రానుంది. కాగా, రెండేళ్ల బకాయిలను త్వరలో చెల్లించనుంది.
News March 24, 2025
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్

బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అనుకున్న తేదీ కన్నా ముందుగానే రానున్నట్లు తాజాగా తెలిపారు. ఏప్రిల్ 4న ఈ చిత్రం రీరిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. భారత దేశ సినీ చరిత్రలోనే తొలి టైమ్ ట్రావెల్ సినిమాగా ఇది రికార్డులకెక్కింది.