News July 14, 2024
జాగ్రత్త.. రేపు భారీ వర్షాలు

ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, అల్లూరి, మన్యం జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. తెలంగాణలోనూ అతి <<13628220>>భారీ వర్షాలు<<>> కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
Similar News
News November 19, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా వెదర్ రిపోర్ట్..!

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ 9.5, కోహిర్ 9.6, మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 10.1, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 9.6, కొండపాకలో 10.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్‌లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్‌లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
News November 19, 2025
ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 13 మంది మృతి

దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.


