News January 6, 2025
చిన్నారులు, రోగుల విషయంలో జాగ్రత్త: CM
AP: దేశంలో hMPV కేసులు పెరుగుతుండటంతో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు, రోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయంజా కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిపుణులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ నియమించాలని, వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు.
Similar News
News January 17, 2025
ఫొటోలతో అనుబంధాన్ని వ్యక్తపరిచారు!
సంసార జీవితం పదికాలాల పాటు సాగాలంటే ఆ జంట మధ్య అన్యోన్యత పరిఢవిల్లాలి అని చెబుతుంటారు. అయితే, ఆ అన్యోన్యత ఎలా చూపించాలనే దానికి ఓ జంట కొత్త అర్థాన్ని చూపింది. 12 ఏళ్ల క్రితం కలిసిన ఈ జంట ఏటా ఓ ఫొటో దిగుతూ వారి మధ్య ఉన్న అన్యోన్యతను చూపుతూ వచ్చింది. వీరిద్దరికీ ఓ పాప జన్మించగా ఆమెతోనూ ఫొటోకు పోజులిస్తూ వచ్చారు. ఇలా ఒక్క మాట మాట్లాడకుండా వారి మధ్య ఉన్న బంధాన్ని వ్యక్తపరిచారు.
News January 17, 2025
ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN
AP: పేదలకు ఇళ్ల స్థలాలపై క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని అధికారులకు సూచించారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని చెప్పారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.
News January 17, 2025
ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు: షర్మిల
AP: ‘ఏరుదాటేదాక ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’ తీరుగా CBN వ్యవహారం ఉందని APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి ఇప్పుడు ఆదాయం పెరగాలంటున్నారని దుయ్యబట్టారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఏపీకి ఏమాత్రం సహకరించని మోదీతో పొత్తు ఎందుకని Xలో నిలదీశారు.