News October 30, 2024

దీపావళి వేళ స్వీట్లతో జాగ్రత్త!

image

దీపావళి సందర్భంగా చాలామంది స్వీట్లు ఆరగిస్తుంటారు. స్వీట్లపై ఉండే సిల్వర్‌పూతలో కొన్నిసార్లు కల్తీ జరిగే అవకాశం ఉంది. ఆ కల్తీని గుర్తిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. స్వీట్‌పై ఉన్న సిల్వర్‌ ‌పేపర్ కల్తీదో లేదో తెలుసుకునేందుకు కాస్త సిల్వర్ పొరను తీసుకొని రెండు వేళ్లతో రబ్ చేయండి. అది పౌడర్‌గా మారితే అది స్వచ్ఛమైంది. చిన్నచిన్న ముక్కలుగా మారిందంటే అది అల్యూమినియంతో కల్తీ జరిగిందని అర్థం.

Similar News

News November 4, 2024

HDFC బ్యాంక్ ఖాతాదారులకు గమనిక

image

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూపీఐ లావాదేవీలకు ఈ నెల 5, 23 తేదీల్లో అంతరాయం కలగనుంది. 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, 23వ తేదీ 12 గంటల నుంచి 3గంటల వరకు సిస్టమ్స్ నిర్వహణ కారణంగా యూపీఐ చెల్లింపులు చేయలేరని ఆ బ్యాంకు తెలిపింది. అలాగే దుకాణదారులు సైతం యూపీఐ సేవలు పొందలేరని పేర్కొంది.

News November 4, 2024

వెలుగులోకి శతాబ్దాల నాటి నగరం!

image

మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో వందల ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన మాయా నాగరికతకు చెందిన నగరాన్ని సైంటిస్టులు గుర్తించారు. దీనికి వలేరియానా అని పేరు పెట్టారు. రాజధాని తరహాలో ఉన్న ఈ సిటీలో 6,674 రకాల కట్టడాలను గుర్తించారు. పిరమిడ్లు, కాజ్‌వేలు, డ్యామ్‌లు, బాల్ కోర్ట్, కొండలపై ఇళ్లు ఉన్నాయి. 50 వేల మంది నివసించి ఉండొచ్చని అంటున్నారు. లిడార్ అనే లేసర్ సర్వే ద్వారా దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు.

News November 4, 2024

పుష్ప-2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

image

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.