News December 31, 2024
ఇలాంటి మహిళలతో జాగ్రత్త
TG: హైదరాబాద్‌లో పలువురు కిలేడీలు రెచ్చిపోతున్నారు. వాహనదారులను లిఫ్ట్ అడిగి ఎక్కి కొద్ది దూరం వెళ్లాక వాళ్లనే బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే తమపై లైంగిక దాడికి యత్నించారని కేసు పెడతామంటూ దందా చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు లాగేసుకున్నారు. అతని ఫిర్యాదుతో మల్కాజ్‌గిరికి చెందిన భాగ్య, సఫీల్‌గూడ వాసి వెన్నెలను పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News January 26, 2025
జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండాను ఎగురవేశారు. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొన్నారు.
News January 26, 2025
మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్: రష్మిక
తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా. నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదు. నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు. కాగా రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.
News January 26, 2025
అక్కడ ఈ తరంలో తొలిసారి జెండా ఎగురుతోంది
ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో రెండు దశాబ్దాలుగా జాతీయ జెండా ఎగరలేదు. ఆ ప్రాంతం మావోల కీలక నేత హిడ్మా నేతృత్వంలోని PLGA బెటాలియన్ 1 పరిధిలోనిది. ఇరవై ఏళ్లుగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వ పాలన లేని అక్కడ భద్రతా బలగాలు ఇటీవల పట్టు సాధించాయి. ఫోర్సెస్ 14 క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దీంతో 14 గ్రామాల్లో ఇవాళ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బస్తర్ యువతరం తొలిసారి జెండావందనం చూడబోతుందని IG సుందర్ రాజ్ తెలిపారు.