News August 10, 2024
BEAUTIFUL: ప్రధానిపై చిట్టితల్లి ఆప్యాయత
వయనాడ్‌ను ఈరోజు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ప్రధాని మోదీ ఆస్పత్రుల్లో బాధితుల్ని కూడా పరామర్శించారు. విపత్తు సమయంలో వారు పడిన కష్టాన్ని విని చలించిపోయారు. ఈ క్రమంలో ఓ బాధిత కుటుంబానికి చెందిన చిన్నారిని పలకరించారు. తాతయ్యలా అనిపించారో ఏమో కానీ ఆ చిట్టి తల్లి ప్రధాని బుగ్గల్ని ప్రేమగా నిమిరింది. ఆయనా చిన్నారిని ప్రేమగా హత్తుకున్నారు. PM వయనాడ్ పర్యటనలో ఈ ఘటన ప్రధాన ఆకర్షణగా మారింది.
Similar News
News September 21, 2024
సెప్టెంబర్ 21: చరిత్రలో ఈ రోజు
✒ 1862: తెలుగు మహాకవి గురజాడ అప్పారావు జయంతి
✒ 1931: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం
✒ 1979: వెస్టీండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ జననం
✒ 1939: రచయిత్రి రంగనాయకమ్మ జననం
✒ 2003: సినీ నటి కృతి శెట్టి జననం
✒ 2012: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం
✒ అంతర్జాతీయ శాంతి దినోత్సవం
✒ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం
News September 21, 2024
సంచలనం.. SAపై అఫ్గాన్ భారీ విజయం
సౌతాఫ్రికాపై రెండో ODIలో అఫ్గాన్ 177 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో తొలిసారి ఆ జట్టుపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అఫ్గాన్ 311/4 స్కోర్ చేయగా, SA 34.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. రషీద్ 5, ఖరోటే 4 వికెట్లు తీశారు. బవుమా 38, జోర్జి 31, మార్‌క్రమ్ 21, హెండ్రిక్స్ 17 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్ 105, అజ్మతుల్లా 86, రహ్మత్ 50 అదరగొట్టారు.
News September 21, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.