News May 23, 2024

బెస్ట్ ఫీచర్.. మీరూ యూజ్ చేయండి!

image

మొబైల్ ఫోన్స్‌లో ఉండే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఫీచర్ గురించి చాలామందికి తెలియదు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్టులో ఫ్యామిలీ మెంబర్స్ నంబర్లు యాడ్ చేసుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఇతరులు వారికి కాల్ చేసి ఇన్‌ఫార్మ్ చేయొచ్చు. దీనికోసం ఆండ్రాయిడ్‌లో Settings> safety & Emergency >add numbers. అన్‌లాక్ చేసే సమయంలో ఎమర్జెన్సీ కాల్ క్లిక్ చేస్తే వీరి నంబర్స్ వస్తాయి.

Similar News

News April 19, 2026

మూడు నెలల్లో 73,200 ఉద్యోగాలు ఉఫ్!

image

ఈ ఏడాదిలో తొలి మూడునెలల్లోనే 95 కంపెనీలు ఏకంగా 73,200 ఉద్యోగాల్లో కోత ప్రకటించినట్లు Layoffs.fyi వెల్లడించింది. ఏఐ వాడకం పెరగడం, కాస్ట్ కట్టింగే ఇందుకు కారణం. ఇందులో బడా కంపెనీలైన మెటా, ఒరాకిల్, స్నాప్, డిస్నీ కూడా ఉన్నాయి. ఒరాకిల్ దాదాపు 30వేల ఉద్యోగాలు కట్ చేసింది. ఇందులో భారత్‌లోనే 12వేల ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. ఇక మెటాలో 2000+ ఉద్యోగాలు పోగా డిస్నీ 1000 మందిని తొలగించింది.

News April 19, 2026

రీఛార్జ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్

image

కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. రూ.799 (1.5gb/రోజుకు) ప్లాన్ రేటును ఏకంగా రూ.100 పెంచేసి రూ.899గా నిర్ణయించింది. అటు రూ.859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

News April 19, 2026

సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

image

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్‌కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.