News September 2, 2024
BRS విజన్‌తోనే మరింత మెరుగ్గా హైదరాబాద్: KTR

భారీ వర్షాలకు సైతం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికాలేదనే వార్త వినేందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. దీనికి కారణం SNDP అని ఆయన పేర్కొన్నారు. ‘BRS విజన్‌ను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఇంజినీర్ల బృందం, అన్ని విభాగాలు కలిసికట్టుగా శ్రమించాయి. మీ అంకితభావం వల్లే ఈరోజు హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉంది. నాతో నిలబడి ఈ నగరాన్ని ప్రగతికి నమూనాగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని KTR ట్వీట్ చేశారు.
Similar News
News December 9, 2025
షాంఘైలో మహిళ నిర్బంధం.. ఏం జరిగింది?

పెమా వాంగ్ అనే మహిళ గత నెల లండన్ నుంచి జపాన్ వెళ్తుండగా తన ఫ్లైట్ ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో ఆగింది. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు తన పాస్‌పోర్టులో అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో అది చెల్లదని 18గంటలు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఆపై IND ఎంబసీని సంప్రదిస్తే సాయం అందినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. AR.P ఎప్పటికీ INDలో భాగమే అని, అక్కడి ప్రజలు భారత్ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారని చెప్పింది.
News December 9, 2025
డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

1946: ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
– అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
News December 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


