News September 2, 2024

BRS విజన్‌తోనే మరింత మెరుగ్గా హైదరాబాద్‌: KTR

image

భారీ వర్షాలకు సైతం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికాలేదనే వార్త వినేందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. దీనికి కారణం SNDP అని ఆయన పేర్కొన్నారు. ‘BRS విజన్‌ను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఇంజినీర్ల బృందం, అన్ని విభాగాలు కలిసికట్టుగా శ్రమించాయి. మీ అంకితభావం వల్లే ఈరోజు హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉంది. నాతో నిలబడి ఈ నగరాన్ని ప్రగతికి నమూనాగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని KTR ట్వీట్ చేశారు.

Similar News

News September 19, 2024

ఈ నెల 21న సీఎంగా ఆతిశీ ప్రమాణం

image

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆతిశీతో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రకటించారు.

News September 19, 2024

కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు

image

TG: కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడింది. APలోని ప.గో.లో ఆయనపై కేసు నమోదవ్వగా తెలంగాణ దేవాదాయశాఖ చర్యలకు దిగింది. సీతారామకు కొడుకులు లేకపోవడంతో వెంకట సీతారాంను దత్తత తీసుకుని తాడేపల్లి గూడెంకు చెందిన యువతితో పెళ్లి చేశారు. ఈ క్రమంలో తన పోలికలతో వారసుడు కావాలని కోడలిని వేధించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.

News September 19, 2024

‘దేవర’ రన్ టైమ్ ఎంతంటే?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ & ఎండ్ క్రెడిట్స్ కాకుండా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా మరింత హైప్ ఇచ్చేందుకు మేకర్స్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే HYDలో మూవీ ప్రీరిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది.