News December 9, 2024

యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కాల్ వస్తే జాగ్రత్త!

image

AP: తమ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ టిప్స్ చెప్తామని, లాభాలు చూపిస్తామంటే కాల్స్ వస్తే నమ్మొద్దని VJA పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున మోసపోతే బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అలాగే, పోలీస్/సీబీఐ/ఈడీ అధికారుల పేరుతో వచ్చే వీడియో కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వీడియో కాల్స్, మెసేజ్‌ల ద్వారా అరెస్టులు చేయరని అవగాహన కల్పిస్తున్నారు.

Similar News

News October 29, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు!

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 29, 2025

బాత్రూమ్‌లో ఈ తప్పులు చేయకండి!

image

బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
*బాత్రూంలో ఫోన్ వాడొద్దు.
*మూత తెరిచి ఫ్లష్ చేస్తే వ్యాధికారక క్రిములు వ్యాపిస్తాయి.
*ఎక్కువ సేపు కమోడ్‌పై కూర్చుంటే పైల్స్ రావచ్చు.
*రోజూ వేడి నీటి స్నానం చర్మాన్ని పొడి బారుస్తుంది.
*ఎక్కువ సబ్బు వాడటం చర్మానికి హానికరం.
*బలంగా టవల్‌తో రుద్దితే అది చర్మానికి నష్టం కలిగిస్తుంది. Share it

News October 29, 2025

ఆ రూ.20 లక్షలు మాకొద్దు: బాధితురాలు

image

కరూర్‌ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాల సహాయార్థం TVK చీఫ్ విజయ్ రూ.20 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ డబ్బును తిప్పి పంపడం చర్చనీయాంశమైంది. ‘మాకీ డబ్బు ముఖ్యం కాదు. నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందు డబ్బు తీసుకోమని చెప్పారు. ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. చెన్నై సమావేశానికి వెళ్లేందుకు మేము నిరాకరిస్తే మా బంధువులను తీసుకెళ్లారు’ అని తెలిపారు.