News December 9, 2024
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కాల్ వస్తే జాగ్రత్త!
AP: తమ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ టిప్స్ చెప్తామని, లాభాలు చూపిస్తామంటే కాల్స్ వస్తే నమ్మొద్దని VJA పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున మోసపోతే బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అలాగే, పోలీస్/సీబీఐ/ఈడీ అధికారుల పేరుతో వచ్చే వీడియో కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వీడియో కాల్స్, మెసేజ్‌ల ద్వారా అరెస్టులు చేయరని అవగాహన కల్పిస్తున్నారు.
Similar News
News January 15, 2025
రేపు కనుమ.. ప్రత్యేకతలు ఇవే!
3 రోజుల సంక్రాంతి వేడుకల్లో రేపు కీలకమైన కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను ఈ రోజున అలంకరించి పూజించడం ఆనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమనాడు మినప వడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరి. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి. అందుకే పండక్కి వచ్చిన వారు రేపు తిరుగు ప్రయాణం చేయకూడదంటారు. 3 రోజులు పండుగను ఆస్వాదించిన తర్వాతే తిరిగెళ్లాలనేది సంప్రదాయం.
News January 14, 2025
తుది దశకు హమాస్-ఇజ్రాయెల్ వార్!
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 15 నెలలుగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో శాంతి స్థాపన కోసం కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. బందీల విడుదలకు హమాస్ ఓకే చెప్పిందని మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతర్ పేర్కొంది. 2023 OCT 7న హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 47వేల మంది మరణించారు.
News January 14, 2025
నిద్రలో కింద పడిపోతున్నట్లు అనిపిస్తోందా?
చాలామంది నిద్రలోకి జారుకోగానే కిందపడిపోతున్నామనే ఫీలింగ్ వచ్చి జెర్క్ ఇస్తారు. దీన్నే హిప్నిక్ జెర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. నిద్రపోతుండగా శరీర కండరాల్లో కదలికల వల్లే ఈ ఆకస్మిక కుదుపులు సంభవించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, ఆందోళన, అలసట కూడా కారణాలేనట. అయితే నిద్ర డిస్టర్బ్ కావడం, తరచూ దీనికి గురైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.