News May 25, 2024

స్టాక్ మార్కెట్ మోసాలతో జాగ్రత్త! – 1/2

image

ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో షేర్ మార్కెట్ టిప్స్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేటుగాళ్ల వలలో పడి బాధితులు రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల గుజరాత్‌కు చెందిన ఓ మాజీ సీఏను కేటుగాళ్లు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామని ‘Stock Vanguard 150’ అనే గ్రూప్‌లో చేర్పించారు. నకిలీ పోర్ట్‌ఫోలియోలో అతడి చేత రూ.1.97కోట్లు పెట్టుబడి పెట్టించి టోకరా వేశారు.

Similar News

News February 16, 2025

ఫాస్టాగ్ కొత్త రూల్స్.. చెక్ చేసుకోండి

image

ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి NPCI రేపటి నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. బ్లాక్‌లిస్టులో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సిందే. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్టాగ్‌ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్ సరిచూసుకోవడం మంచిది.

News February 16, 2025

నిద్రలేవగానే ఇలా చేయండి

image

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.

News February 16, 2025

కోళ్లు చనిపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

TG: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మం. నేలపట్లలో వెయ్యి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు కోళ్ల నమూనాలు సేకరించి HYDలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబుకు పంపారు. 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ రానుందని, అప్పటివరకు కోళ్లు అమ్మవద్దని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు చనిపోతే 9100797300కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

error: Content is protected !!