News April 30, 2024

జాగ్రత్త! తెలివిగా ఓటేయండి: హర్ష గోయెంకా

image

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఎన్నికల వేళ ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ట్విటర్ ఖాతా ద్వారా తరచూ పలు అంశాలపై ప్రజలకు సూచనలు చేసే ఆయన ఒక్క ఫొటోతో ఓటు విలువను చాటి చెప్పారు. ‘ప్రజలారా జాగ్రత్త! నేతల వాగ్దానాలపై కాకుండా పనితీరుపై ఆలోచించండి. తెలివిగా ఓటు వేయండి. మోసపోకండి’ అంటూ ట్వీట్ చేశారు. దానికి ‘పాలకుల చేతిలో మనం బకరా కావొద్దు’ అని అర్థం వచ్చేలా ఓ పెద్ద మేక ఫొటోను జతచేశారు.

Similar News

News March 6, 2026

మళ్లీ బేర్ గుప్పిట్లోకి స్టాక్ మార్కెట్లు!

image

మూడు రోజుల నష్టాల నుంచి నిన్న తేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ రెడ్‌లోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు పతనమయ్యాయి. సెషన్ మొదట్లో బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గల్ఫ్‌లో యుద్ధం తీవ్రతరం కావడం ఇన్వెస్టర్లను భయాల్లోకి నెట్టింది. దీంతో భారీగా షేర్ల అమ్మకాలు చేపడుతున్నారు.

News March 6, 2026

130+ గంటలుగా ఇరాన్‌ ఆఫ్‌లైన్!

image

ఇజ్రాయెల్-USతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌లో 130+ గంటలుగా ఇంటర్నెట్ నిలిచిపోయింది. 1 % మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ తెలిపింది. అటు గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నవారికి టెలీ కమ్యూనికేషన్ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చెప్పింది. భద్రతాపరమైన కారణాలతో అంతర్గత విషయాలు లీక్ కాకుండా ఇలా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.

News March 6, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారికి శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 59,194 మంది శ్రీవారిని దర్శించుకోగా 25,295 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది.